Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిరాశలో కూరుకుపోయిన టీమిండియాకు సచిన్ అండ

ఆస్ట్రేలియాతో సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టెస్టులో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని నిరాశలో మునిగిన క్రికెట్ జట్టుకు లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అండగా నిలిచారు. ఈ ఉదయం ఢిల్లీలో జరిగిన 21 కిలోమీటర్ల మారథాన్ లో పాల్గొన్న సచిన్, మీడియాతో మాట్లాడారు. ఇండియా జట్టు సిరీస్ ను కోల్పోలేదని, మన ఆటగాళ్లలో పోరాటపటిమ ఉందని అన్నారు. ఒక్క ఓటమిని చవి చూసినంత మాత్రాన పోరాడలేక చేతులు ఎత్తేసినట్టు భావించరాదని, తదుపరి జరిగే మ్యాచ్ లలో భారత ఆటగాళ్లు పుంజుకుని, మంచి ప్రదర్శన ఇస్తారన్న నమ్మకం ఉందని సచిన్ చెప్పారు.

More Telugu News