ఆనాడు కొంచెం హార్ష్ గానే మాట్లాడా... అయినా వాళ్లకు ఎక్కలేదు!: వర్మ, యండమూరిలపై నాగబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆనాడు కొంచెం హార్ష్ గానే మాట్లాడా... అయినా వాళ్లకు ఎక్కలేదు!: వర్మ, యండమూరిలపై నాగబాబు

లక్షలాది మంది ఫాలోయర్లు ఉన్న రాంగోపాల్ వర్మ తన కుటుంబ సభ్యుల గురించి వ్యంగ్యంగా మాట్లాడుతుంటే, రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పబ్లిక్ గా చరణ్ గురించి వ్యాఖ్యానిస్తుంటే, ఎవరో ఒకరం స్పందించాలని మాత్రమే, 'ఖైదీ నంబర్ 150' ఫంక్షన్ లో తాను స్పందించానని నటుడు నాగబాబు స్పష్టం చేశాడు.

ఓ దినపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ, ఒకరిని లక్ష్యంగా చేసుకుని ఒకటికి, పదిసార్లు మాట్లాడితే, అందరూ దాన్నే నిజమనుకుంటారని, ఆ భావన తొలగించాలన్నదే తన ఉద్దేశమని చెప్పాడు. ఆ రోజు తాను కొంచెం మంచిగా, మర్యాదగా చెప్పి ఉంటే బాగుండేదని, కొంచెం హార్ష్ గానే మాట్లాడానని అంగీకరించాడు. అయినా వాళ్లకు ఎక్కలేదని అన్నాడు. వర్మ, యండమూరితో తనకు వైరం లేదని, వారు ఎన్ని అన్నా పట్టించుకోబోనని తెలిపాడు.

More Telugu News