కాశ్మీర్ ను కోల్పోవాల్సి వస్తుందేమోనన్న చిదంబరం... ఇక పాక్ రెచ్చిపోతుందని మండిపడ్డ వెంకయ్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాశ్మీర్ ను కోల్పోవాల్సి వస్తుందేమోనన్న చిదంబరం... ఇక పాక్ రెచ్చిపోతుందని మండిపడ్డ వెంకయ్య

కాశ్మీర్ ను భారత్ కోల్పోవాల్సి వస్తుందేమోనని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యానించడాన్ని బీజేపీ నేత, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తీవ్రంగా ఖండించారు. ఇటీవల చిదంబరం మాట్లాడుతూ, కాశ్మీర్ ను వదులుకుంటే, ఉత్తరాన పరిస్థితులు చక్కబడి, ఉగ్రవాద దాడులు తగ్గుతాయన్న కోణంలో చిద్దూ వ్యాఖ్యానించగా, ఇవి పాక్ కు సంతోషాన్ని కలిగించేలా ఉన్నాయని, ఇకపై పాక్ మరింత ఉత్సాహంగా ఇండియాపై విషం చిమ్ముతుందని వెంకయ్య అన్నారు. భారత మాజీ మంత్రి కూడా తమకు అనుకూలంగా ఉన్నారంటూ పాక్ వాదిస్తుందని అభిప్రాయపడ్డారు. చిదంబరం వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News