ముందుగా పోలీసుల ఇబ్బందులపై పోరాడండి!: పోలీసు అధికారుల సంఘానికి రోజా కౌంటర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముందుగా పోలీసుల ఇబ్బందులపై పోరాడండి!: పోలీసు అధికారుల సంఘానికి రోజా కౌంటర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు డీజీపీ సాంబశివరావు బానిసలా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. డీజీపీపై రోజా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు చెప్పారు. రోజా వ్యాఖ్యానించినట్టు పోలీసులు ఎవరికీ బానిసలు కారని... కేవలం చట్టానికి మాత్రమే బానిసలని అన్నారు. రోజా వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా రోజా నియంత్రణ పాటించాలని సూచించారు.

పోలీసు అధికారుల సంఘం తనపై విమర్శలు చేసిన నేపథ్యంలో, రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను క్షమాపణలు చెప్పాలని కోరేముందు... సచివాలయం, సీఎం నివాసం వద్ద పని చేస్తున్న పోలీసుల ఇబ్బందులపై పోరాడాలని పోలీస్ అధికారుల సంఘానికి ఆమె సూచించారు. పోలీసుల సమస్యలపై సంఘం పోరాడేందుకు సిద్ధమైతే... తాను కూడా ఆ పోరాటంలో పాల్గొనేందుకు సిద్ధమేనని చెప్పారు. అసెంబ్లీలో తనను అడ్డుకునేందుకు యత్నించే వారికి సరైన సమాధానమిస్తానని తెలిపారు.

More Telugu News