Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బళ్లారిలో కుప్పకూలిన రథం.. 30 మందికి గాయాలు

కర్ణాటకలోని బళ్లారి జిల్లా కొట్టూరులో గురు కుట్టురేశ్వరస్వామి రథోత్సవ వేడుకలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇక్కడ నిర్వహిస్తున్న జాతరలో 60 అడుగుల రథం చక్రం విరగడంతో కుప్పకూలింది. ఈ ఘటనలో సుమారు 30 మంది భక్తులకు గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను బళ్లారిలోని విమ్స్ కు తరలించారు.

More Telugu News