సొమ్ము చెల్లించకపోతే.. శశికళ మరో 13 నెలలు జైల్లోనే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సొమ్ము చెల్లించకపోతే.. శశికళ మరో 13 నెలలు జైల్లోనే!

అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 కోట్ల జరిమానాను శశికళకు సుప్రీంకోర్టు విధించింది. ఈ నేపథ్యంలో, జరిమానాను శశికళ చెల్లించకపోతే ఏమవుతుందనే ప్రశ్న చాలా మందిలో నెలకొంది. ఒకవేళ రూ. 10 కోట్ల జరిమానాను శశికళ కట్టలేకపోతే... మరో 13 నెలల అదనపు జైలు శిక్షను ఆమె అనుభవించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని జైలు అధికారులు తెలిపారు.

2014లో ట్రయల్ కోర్టు ఆమెకు జైలు శిక్షను విధించడంతో... అప్పట్లో ఆమె 21 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం ఆమె మూడు సంవత్సరాల 11 నెలల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంది.  

More Telugu News