నటి భావనపై ‘కైరాలీ’ ఛానెల్ లో తప్పుడు కథనంపై విమర్శలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నటి భావనపై ‘కైరాలీ’ ఛానెల్ లో తప్పుడు కథనంపై విమర్శలు!

మలయాళ నటి భావన కిడ్నాప్, లైంగిక దాడి సంఘటనకు సంబంధించి అధికార సీపీఎంకు చెందిన ‘కైరాలి’ టీవీ ఛానెల్ ప్రసారం చేసిన కథనాలపై విమర్శలు వెల్లువెత్తాయి. కిడ్నాప్ నకు సూత్రధారిగా వ్యవహరించిన ఆమె కారు డ్రైవర్ తో భావనకు సంబంధం ఉందంటూ ఆధారాలు లేని ఓ కథానాన్ని సదరు ఛానెల్ ప్రసారం చేసింది. దీనిపై, ఆమె అభిమానులు మండిపడుతున్నారు. లైంగిక దాడికి గురైన బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచాలన్న నిబంధనను ఆ ఛానెల్ తుంగలో తొక్కిందని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీవీలో ఈ ప్రసారాలపై నటుడు పృథ్వీరాజ్, నటి రిమా కల్లింగల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ పి రేటింగ్స్ కోసం తప్పుడు కథనాలు ప్రచురించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. దీంతో, ‘కైరాలీ’ యాజమాన్యం క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది.

More Telugu News