నేనే నెంబర్ వన్, ఎన్టీఆరే నెంబర్ టు!: నాదెండ్ల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేనే నెంబర్ వన్, ఎన్టీఆరే నెంబర్ టు!: నాదెండ్ల

నాడు టీడీపీలో తానేనెంబర్ వన్ అని, ఎన్టీఆరే నెంబర్ టు అని నాదెండ్ల భాస్కరరావు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఆ రోజు మీడియా అంతా నేను దుర్మార్గుడిని, ఎన్టీఆర్ సన్మార్గుడు అన్నట్లుగా చిత్రీకరించింది. ఆయన చేసిన పాపాలన్నీ చెబితే ‘తూ’ అని ఉమ్మేస్తారు. ఎన్టీఆర్ ను అప్రతిష్టపాలు చేసే ఉద్దేశంతో నేను ఎప్పుడూ తప్పుడు సలహాలు ఇవ్వలేదు. భగవత్ సాక్షిగా చెబుతున్నాను.. అట్లాంటి పనులు నేను చేయను. నాడు చంద్రబాబు సలహాలు చెబుతుండేవాడు. ఆ సలహాలను విని పూనకంతో ఎన్టీఆర్ వచ్చేవాడు.... రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం గురించి ఎన్టీఆర్ కు ఏం తెలుసు?’ అని నాదెండ్ల భాస్కరరావు అన్నారు.

More Telugu News