స్టాలిన్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు.. ఆగ్రహంతో నడుచుకుంటూ వెళ్లిపోయిన ప్రతిపక్షనేత!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్టాలిన్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు.. ఆగ్రహంతో నడుచుకుంటూ వెళ్లిపోయిన ప్రతిపక్షనేత!

తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామి ఈ రోజు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటున్నారు. పన్నీర్ కు వ్యతిరేకంగా ఓటేయాలంటూ ప్రతిపక్ష డీఎంకే విప్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో, తన పార్టీ ఎమ్మెల్యేలతో కలసి డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అసెంబ్లీకి వచ్చారు. అయితే, ఆయన కారును అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు తనిఖీ చేశారు. దీంతో, ఆయనలోని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రతిపక్ష నేత వాహనాన్నే సోదా చేస్తారా? అంటూ పోలీసులపై స్టాలిన్ మండిపడ్డారు. ఇది అత్యంత దారుణమని అన్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ, తన ఎమ్మెల్యేలతో కలసి అసెంబ్లీలోకి నడుచుకుంటూ వచ్చారు. 

More Telugu News