వేలానికి హిట్లర్ వాడిన రెడ్ ఫోన్.. శత్రువుల ప్రాణాలు తీయాలని ఈ ఫోన్‌లోనే ఆదేశించారట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వేలానికి హిట్లర్ వాడిన రెడ్ ఫోన్.. శత్రువుల ప్రాణాలు తీయాలని ఈ ఫోన్‌లోనే ఆదేశించారట!

ప్రపంచాన్ని గడగడలాడించిన జర్మన్ నియంత అడాల్ఫ్‌ హిట్లర్ వినియోగించిన పర్సనల్‌ ట్రావెలింగ్‌ ఫోన్‌ వేలానికి వచ్చింది. ఆయ‌న అప్పట్లో వాడిన రెడ్ ఫోన్‌ ఈ వేలంలో కనీసం రెండు నుంచి మూడు లక్షల అమెరికన్‌ డాలర్ల ధర పలుకుతుందని నిర్వాహ‌కులు అంచ‌నా వేస్తున్నారు. చెసాపెకే సిటీలో జరగనున్న అలెగ్జాండర్‌ హిస్టారికల్‌ వేలంలో ఉంచ‌నున్న ఈ రెడ్‌ ఫోన్‌పై హిట్లర్‌ పేరు కూడా ఉండ‌డంతో దాని కోసం పోటీ బాగానే ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. అప్ప‌ట్లో నియంత‌ హిట్లర్ ఇదే ఫోన్‌లో మాట్లాడి ఆదేశాలు జారీ చేస్తూ వేలాది మంది ప్రాణాలు బలిగొన్నారని వేలం నిర్వాహకులు పేర్కొంటున్నారు.

More Telugu News