షాకింగ్.. సినీ హీరోయిన్ భావన కిడ్నాప్... కారులోనే లైంగిక వేధింపులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షాకింగ్.. సినీ హీరోయిన్ భావన కిడ్నాప్... కారులోనే లైంగిక వేధింపులు

సినీ నటి భావన లైంగిక వేధింపులకు గురైన ఘటన కలకలం రేపుతోంది. నిన్న రాత్రి షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వెళుతున్న సమయంలో... ఆమె కారును కొందరు అడ్డగించి, ఆమెను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత కారులోనే ఆమెను లైంగికంగా వేధించారు. దాదాపు గంట సేపు లైంగిక వేధింపులకు గురి చేసిన తర్వాత ఆమెను వదిలేశారు. ఈ క్రమంలో, భావనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను కూడా వారు తీసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో జరిగింది.

ఈ కేసుకు సంబంధించి, ఆమె పాత డ్రైవర్ మార్టిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కీలక నిందితుడు సునీల్ పరారీలో ఉన్నాడు. వీరిపై కిడ్నాప్ తో పాటు, లైంగిక వేధింపుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వేధింపులకు గురైన తర్వాత ఆ విషయాన్ని మొదట డైరెక్టర్ కు తెలిపింది భావన. దీంతో, ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. తెలుగులో కూడా భావన నిప్పు, ఒంటరి, మహాత్మా, హీరో తదితర చిత్రాల్లో నటించింది. 

More Telugu News