సినిమాలో కలసి నటించారు... 'పక్కాప్లాన్'తో సహజీవనం చేశారు... చివరికి పోలీస్ స్టేషన్ కు చేరారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమాలో కలసి నటించారు... 'పక్కాప్లాన్'తో సహజీవనం చేశారు... చివరికి పోలీస్ స్టేషన్ కు చేరారు!

టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు రూపొందుతూ ఉంటాయి. అందులో విజయం సాధించే వాటిని మాత్రం వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అలా అసలు విడుదలైందో లేదో కూడా తెలియని ఓ సినిమాలో ద్వితీయ ప్రాధాన్య పాత్రల్లో నటించి, సహా నటితో సహజీవనం చేసిన నటుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'పక్కా ప్లాన్' అనే సినిమాలో కర్ణాటకలోని యాదగిరి జిల్లాకు చెందిన నరేష్‌ యాదవ్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన నాగరాణి రెండో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించారు.

ఈ సినిమాలో నటించే నాటికే నాగరాణికి వివాహమై విడాకులు కూడా తీసుకుంది. అప్పటికే ఆమెకు ఆరు నెలల పాప కూడా ఉంది. సినిమాలో నటిస్తున్న సమయంలో నరేష్ తో నాగరాణికి పరిచయం పెరిగింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ ఒకే ఇంటికి మకాం మార్చారు. చాలా కాలంగా సహజీవనం చేస్తుండడంతో తనను వివాహం చేసుకోవాలని నాగరాణి ఒత్తిడి చేయడం ప్రారంభించింది. దీంతో నరేష్ ఆమెకు ముఖం చాటేశాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు, అతనిని అదుపులోకి తీసుకున్నారు. 

More Telugu News