లేటెస్ట్ ట్విస్ట్... పన్నీర్ సెల్వం, పళనిస్వామిలకు అపాయింట్ మెంట్ ఇచ్చిన గవర్నర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లేటెస్ట్ ట్విస్ట్... పన్నీర్ సెల్వం, పళనిస్వామిలకు అపాయింట్ మెంట్ ఇచ్చిన గవర్నర్

తమిళనాట రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. నేటి సాయంత్రానికి పళనిస్వామిని ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానిస్తారంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు అన్నాడీఎంకే ప్రతినిధులమని, ముఖ్యమంత్రి అభ్యర్థులమని చెప్పుకుంటున్న ఇద్దరికీ అపాయింట్ మెంట్ ఇచ్చారు. నేటి సాయంత్రం 7:30 నిమిషాలకు వచ్చి గవర్నర్ ను కలవాలంటూ రాజ్ భవన్ పళనిస్వామిని ఆహ్వానించింది. 8:30 నిమిషాలకు గవర్నర్ ను కలవాలంటూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ఆహ్వానం పంపారు. దీంతో తమిళనాడులో ఏం జరగనుందన్న ఆసక్తి రేగుతోంది.  

More Telugu News