ఇండియాకు రానున్న పాప్ సెన్సేషన్ జస్టిన్ బీబర్... మే 10న అతిపెద్ద ఈవెంట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇండియాకు రానున్న పాప్ సెన్సేషన్ జస్టిన్ బీబర్... మే 10న అతిపెద్ద ఈవెంట్

ప్రపంచ పాప్ సంచలనం, 22 సంవత్సరాల కెనడా సింగర్ కమ్ రైటర్ జస్టిన్ బీబర్ భారత్ కు రానున్నాడు. ఈ మేరకు మే నెలలో బీబర్ పర్యటన ఖరారైనట్టు టూర్ ప్రమోటర్ వైట్ ఫాక్స్ ఇండియా డైరెక్టర్ అర్జున్ జైన్ వెల్లడించారు. భారత పాప్ ప్రియులు ఎంతో కాలంగా బీబర్ కోసం ఎదురుచూస్తున్నారని, ఆయన ఇక్కడికి వచ్చి, 'వేర్ ఆర్ ఏస్ నౌ', 'బాయ్ ఫ్రెండ్', 'లవ్ యువర్ సెల్ఫ్', 'కంపెనీ', 'యాజ్ లాంగ్ యాజ్ యూ లవ్ మీ', 'వాట్ డూ యూ మీన్', 'బేబీ', 'పర్పస్' వంటి తన సూపర్ హిట్ గీతాలను ఆలపించనున్నారని తెలిపారు. మే 10న ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. గడచిన ఆరు నెలలుగా భారత పర్యటనకు సంబంధించి బీబర్ టీమ్ తో చర్చిస్తున్నామని, ఇంతకాలానికి ఆయన పర్యటన ఖరారైందని తెలిపారు. ఈ ఈవెంట్ ఈ సంవత్సరంలో ఇండియాలో జరిగే అతిపెద్ద ఈవెంట్ కానుందని జైన్ తెలిపారు.

More Telugu News