Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జయ మృతి వెనక ఉన్న కుట్రను వెల్లడిస్తా.. జయ మేనకోడలు దీప

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనక ఉన్న కుట్ర కోణాన్ని త్వరలోనే బయటకు వెల్లడిస్తానని ఆమె మేనకోడలు దీప జయకుమార్ పేర్కొన్నారు. సోమవారం తన నివాసంలో ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ జయ మృతి వెనక దాగిన రహస్యాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. జయను నమ్మి, ఆమె వెన్నంటి నడిచిన కార్యకర్తలను రక్షించుకునే బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. కొత్త పార్టీ పెట్టాలంటూ కార్యకర్తలు తనపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. తనను నమ్మి వచ్చే ఎవరినీ నిర్లక్ష్యం చేయబోనని హామీ ఇచ్చారు. అత్తయ్య జయలలిత మృతి విషయంలో అనుమానాస్పద అంశాలు  చాలానే ఉన్నాయన్నారు. ఆమె ఆస్పత్రిలో ఉన్న 75  రోజులు ఏం జరిగిందో, ఆమెకు ఎటువంటి చికిత్స అందిందో ఎవరికీ తెలియదని దీప అన్నారు.

More Telugu News