Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రష్యాలో కుప్పకూలిన హెలికాప్టర్

రాబిన్‌సన్ 366 రకానికి చెందిన హెలికాప్టర్.. ర‌ష్యాలోని అల్టాయ్ రిపబ్లిక్ ప్రాంతంలో టెలెట్ స్కోయ్ సరస్సు వద్ద నిన్న రాత్రి కుప్పకూలింది. అందులోని ప్ర‌యాణికులంతా గ‌ల్లంతు కావ‌డంతో 160 మందికి పైగా సిబ్బంది ఈ రోజు ఉదయం నుంచి గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు. మరో 68 మంది సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా గాలింపు చేపడుతున్నారు. స‌ద‌రు హెలికాఫ్ట‌ర్‌లో మాజీ డిప్యూటీ చీఫ్ అనాటోలీ బన్యాతో పాటు మొత్తం ఐదుగురు ప్రయాణికులు ఉన్నట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. కాగా, ఇదే మాజీ డిప్యూటీ చీఫ్ గత ఎనిమిదేళ్ల క్రితం ఎమ్ఐ-8 విమాన ప్రమాదంలో తృటిలో త‌ప్పించుకున్నారు.

More Telugu News