: మరో పరిణామం.. ఎమ్మెల్యేలను ఉంచిన రిసార్ట్సుకు బయలుదేరిన శశికళ
తమిళనాడు అధికార అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్ సుమారు 120 మంది ఎమ్మెల్యేలను పలు రిసార్ట్సుల్లో ఉంచిన విషయం తెలిసిందే. అయితే, నిన్న వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన శశికళ.. ఈ రోజు నేరుగా మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. పోయెస్ గార్డెన్‌లోని తన నివాసం నుంచి మహాబలిపురం సమీపంలోని కోవత్తూర్‌లో గల గోల్డెన్ బే రిసార్టుకు ఆమె బయలుదేరారు. మొదట మెరీనా బీచ్ సమీపంలో ఉన్న అమ్మ జయలలిత సమాధిని దర్శించుకొని ఆ తరువాత ఆమె రిసార్టుకి చేరుకుంటారు.