Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇతరుల బాత్రూంలలోకి తొంగి చూడటం మోదీకి అలవాటు: రాహుల్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెయిన్ కోటు వేసుకుని బాత్రూంలో స్నానం చేస్తారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతరుల బాత్రూంలలోకి తొంగి చూడటం మోదీకి అలవాటని రాహుల్ ఎద్దేవా చేశారు. ఆయనకు ఇక మిగిలింది రెండున్నర సంవత్సరాలు మాత్రమేనని... గడచిన రెండున్నర ఏళ్లలో మోదీ దారుణంగా విఫలమయ్యారని అన్నారు. ఎవరైనా ఆయనను ప్రశ్నించినప్పుడు, సమాధానాలు చెప్పలేక ఎదురు దాడికి దిగుతారని రాహుల్ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో 99 శాతం సీట్లను గెలుచుకోవడానికే కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని చెప్పారు. కొంతమంది మన్ కీ బాత్ చెబుతారు కాని, కామ్ కీ బాత్ చెప్పరని ఎద్దేవా చేశారు. 

More Telugu News