: బల నిరూపణకు సిద్ధం... ఆపై తొలి సంతకం 'అమ్మ మరణం'పై విచారణ ఫైలుపైనే!: పన్నీర్ సెల్వం


తనకు మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోందని, అవసరమైతే అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధమని, ఇదే విషయమై గవర్నర్ విద్యాసాగర్ రావుకు మరికాసేపట్లో సమాచారాన్ని అందించనున్నామని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించారు. మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని, ఆపై తన తొలి సంతకం అమ్మ మరణం వెనకున్న రహస్యాలను బయటకు చెప్పేలా విచారణ చేయించే పత్రాలపైనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు జరిపి ప్రజలకు వాస్తవాన్ని తెలియజేస్తానని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఇబ్బందులూ పడకుండా చూడటమే తన లక్ష్యమని అన్నారు.

  • Loading...

More Telugu News