ఆ చానళ్ళపై దాసరి యుద్ధభేరి
డబ్బింగ్ సీరియళ్ళు ప్రసారం చేస్తోన్న కొన్ని చానళ్ళపై దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు యుద్ధభేరి మోగించారు. ఆ చానళ్ళకు వాణిజ్య ప్రకటనలు ఇవ్వరాదంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. అనువాద ధారావాహికలు ప్రసారం చేస్తున్న కొన్ని చానళ్ళ యాజమాన్యాల వైఖరిని నిరసిస్తూ బుల్లితెర కళాకారులు గతకొన్ని రోజులుగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు టీవీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సాగుతున్న ఈ నిరసన కార్యక్రమాలకు దాసరి తన సంఘీభావం ప్రకటించారు.
మేడే పురస్కరించుకుని టీవీ ఆర్టిస్టులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ, కొన్ని చానళ్ళు తెలుగు కళాకారుల ఉపాధిని దెబ్బతీసేలా వ్యవహరించడం తగదన్నారు. పరభాషా సీరియళ్ళతో తెలుగు ప్రాభవాన్ని కాలరాసిన ఘనతను సొంతం చేసుకోవద్దంటూ ఆయా చానళ్ళ యాజమాన్యాలకు ఆయన సలహా ఇచ్చారు.