సీఎం చంద్ర‌బాబుపై బాబా రాందేవ్ ప్ర‌శంస‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై యోగా గురువు బాబా రాందేవ్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు సమర్థవంతమైన నాయకుడని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు వ్యాపారానికి అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఏపీలోని అన్ని విభాగాలు సమన్వయంతో చ‌క్క‌గా పని చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో త‌మ‌ పతంజలి ఫుఢ్స్ యూనిట్ ను నెలకొల్పుతామని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆయ‌న కొనియాడారు.
Go Back to Shorts
ramdev

More Telugu News