ఢిల్లీలో భారీగా రూ.2 వేల నకిలీ నోట్ల పట్టివేత

రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో సెక్యూరిటీ ఫీచ‌ర్ల‌తో రూపొందించిన రూ.2000 నోట్ల‌కు కూడా న‌కిలీ నోట్లను ముద్రిస్తూ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ రోజు ఢిల్లీలో న‌కిలీ నోట్ల ముఠా గురించి స‌మాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు జ‌రిపి అజాద్, మనోజ్, సునిల్ అనే వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.18 లక్షల విలువైన రూ.2000ల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో అజాద్ ది ఢిల్లీ కాగా, మ‌నోజ్, సునీల్‌ల‌ది హర్యాణా రాష్ట్రమని పేర్కొన్నారు. ఈ ముఠాపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.
Go Back to Shorts
demonitization
arrests

More Telugu News