నెల్లూరు శివారులో కుప్పలు తెప్పలుగా ఏటీఎం కార్డులు పారవేత!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నెల్లూరు శివారులో కుప్పలు తెప్పలుగా ఏటీఎం కార్డులు పారవేత!

పెద్ద‌నోట్ల ర‌ద్దు నేపథ్యంలో దేశంలోని బ్యాంకుల్లో భారీగా అక్ర‌మాలు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ప‌లు బ్యాంకుల్లో తెర‌చిన‌ న‌కిలీ ఖాతాలు, జ‌న‌ధ‌న్ ఖాతాల్లో భారీగా డ‌బ్బు జ‌మ అయిన విష‌యం అధికారుల‌కు త‌ల‌నొప్పి తెప్పించింది. అయితే, ఈ రోజు నెల్లూరు శివారులో ఓ విచిత్ర దృశ్యం క‌నిపించింది. ఆ ప్ర‌దేశంలో కుప్ప‌లు తెప్పలుగా ఏటీఎం కార్డులను ప‌డేశారు. భారీ సంఖ్య‌లో బ‌స్తాల్లో మూట‌క‌ట్టి ప‌లువురు ఆ ఏటీఎం కార్డుల‌ను ప‌డేసి వెళ్లారు. వాటిపై వృద్ధుల ఫొటోలు ఉన్న‌ట్లు స్థానికులు గుర్తించారు. ఈ కార్డుల‌న్నీ ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన‌వే.
demonitisation

More Telugu News