అధ్యక్షుడిగా ట్రంప్ వద్దంటూ ‘ట్రంప్ టవర్’ వద్ద ఆందోళనలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అధ్యక్షుడిగా ట్రంప్ వద్దంటూ ‘ట్రంప్ టవర్’ వద్ద ఆందోళనలు!

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇంకా ప్రమాణ స్వీకారం చేయనేలేదు, అప్పుడే నిరసనల పర్వం మొదలైంది. న్యూయార్క్ లోని ట్రంప్ టవర్ వద్ద పెద్ద ఎత్తున పలువురు ఆందోళనలు చేస్తున్నారు. తమకు అధ్యక్షుడిగా ట్రంప్ వద్దని, ప్రపంచం గురించి సరైన అవగాహన ఆయనకు లేదని, అధ్యక్ష పదవికి ఆయన అనర్హుడని వారు విమర్శిస్తున్నారు. స్వప్రయోజనాల కోసం అధ్యక్ష పదవిని ట్రంప్ వినియోగించుకుంటారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. 

More Telugu News