ముప్ఫై ఏళ్ల తర్వాత రజనీ, కమల్ కలసి ఫొటోకు పోజ్ లిచ్చారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముప్ఫై ఏళ్ల తర్వాత రజనీ, కమల్ కలసి ఫొటోకు పోజ్ లిచ్చారు!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమలహాసన్ కలిసి ఫొటోలకు పోజ్ లిచ్చారు. ఫొటోలకు పోజ్ లివ్వడం ఆర్టిస్టులకు కొత్తేమి కాదుగా.. మరి, ఈ ఫొటోలు ఎందుకంత ప్రత్యేకం అంటే..  రజనీ, కమల్ కలిసి ముప్ఫై ఏళ్ల తర్వాత ఫొటోలకు పోజ్ లిచ్చారు కనుక. 'వికటన్' అవార్డుల వేడుకలో జీవిత సాఫల్య పురస్కారాన్ని రజనీ చేతుల మీదుగా కమల్ అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫొటో షూట్ లో అగ్ర నటులు ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరడంతో రజనీ, కమల్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

More Telugu News