ఆ హీరోయిన్ తో నాకు సంబంధం ఉందని సంజయ్ దత్ అనుమానించాడు.. గొడవ పడటానికి వచ్చాడు!: రిషికపూర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ హీరోయిన్ తో నాకు సంబంధం ఉందని సంజయ్ దత్ అనుమానించాడు.. గొడవ పడటానికి వచ్చాడు!: రిషికపూర్

బాలీవుడ్ హీరోయిన్ టీనా మునిమ్ తో తనకు సంబంధముందని హీరో సంజయ్ దత్ అనుమానించాడని నటుడు రిషి కపూర్ తెలిపారు. కానీ, అప్పుడు సంజయ్ పట్ల టీనా ఆకర్షితురాలైందని ఆయన చెప్పారు. అప్పట్లో మీడియా ఇప్పుడున్నంత ఫాస్ట్ గా లేదని... కానీ, బాలీవుడ్ ప్రముఖులంతా తాను, టీనా ఇద్దరూ సీక్రెట్ లైఫ్ అనుభవిస్తున్నామని భావించేవారని తెలిపారు. ఈ విషయాన్ని తన ఆత్మకథ 'ఖుల్లాం ఖుల్లా' అనే పుస్తకంలో రిషి కపూర్ పేర్కొన్నారు.

ఈ విషయం తెలుసుకున్న సంజయ్ దత్ ఇది నిజమే అనుకున్నాడని తన ఆత్మకథలో రిషి కపూర్ తెలిపారు. ఒకరోజు గుల్షన్ గ్రోవర్ తో కలిసి తనతో గొడవపడటానికి నీతూ ఇంటికి సంజయ్ దత్ వచ్చాడని చెప్పారు. అప్పటికి తనకింకా పెళ్లి కాలేదని... అయితే, ఇద్దరి మధ్య గొడవ జరగకుండా నీతూ పరిష్కారం చేసిందని తెలిపారు.

తనకు, టీనాకు మధ్య ఎలాంటి అఫైర్ లేదని... ఇవన్నీ కేవలం పుకార్లేనని... కో స్టార్లుగా ఇద్దరూ సన్నిహితంగా మాత్రమే ఉన్నారని సంజయ్ కు నీతూ వివరించిందని గుర్తు చేసుకున్నారు. అంతటితో ఆ వివాదం సమసిపోయిందని చెప్పారు. ఆ తర్వాత నీతూను తాను వివాహం చేసుకున్నానని... తమ పెళ్లికి సంజయ్ దత్ తో పాటు హీరోయిన్లు అందరూ వచ్చారని తెలిపారు. ఇప్పటికీ ఎప్పుడైనా టీనా విషయం ప్రస్తావనకు వస్తే తాను, సంజయ్ ఇద్దరూ నవ్వుకుంటామని చెప్పారు.

డింపుల్ కపాడియాతో కూడా తనకు అఫైర్ ఉందని అప్పట్లో పుకార్లు వచ్చాయని, అయితే తనపై నీతూకు నమ్మకం ఉండటంతో, ఆ పుకార్లను నీతూ నమ్మలేదని చెప్పారు. డింపుల్ తనకు మంచి స్నేహితురాలు మాత్రమే అని తెలిపారు. 

More Telugu News