గట్టిగా మాట్లాడం వల్ల, ఘర్షణ పడడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయా?: పవన్ కల్యాణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గట్టిగా మాట్లాడం వల్ల, ఘర్షణ పడడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయా?: పవన్ కల్యాణ్

తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు వచ్చినప్పుడు తాను గట్టిగా మాట్లాడనని, నెమ్మదిగా మాట్లాడుతానని కామెంట్లు వినిపిస్తున్నాయని.. అయితే గట్టిగా మాట్లాడామా? ఘర్షణ పడ్డామా? లేదా? అన్నది సమస్యకు పరిష్కారం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాను గట్టిగా మాట్లాడడం వల్ల, ఘర్షణ పడడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయా? అని ఆయన అడిగారు. తనకు సమస్యలు పరిష్కారం కావడం ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేయడం తన విధానమని ఆయన తెలిపారు. తనపై విమర్శలు చేసేవారు అన్నీ గమనించాలని ఆయన సూచించారు.

More Telugu News