మా అబ్బాయికి ‘ తైమూర్’ అనే పేరు ఎందుకు పెట్టామంటే...! సైఫ్ అలీఖాన్ వివరణ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా అబ్బాయికి ‘ తైమూర్’ అనే పేరు ఎందుకు పెట్టామంటే...! సైఫ్ అలీఖాన్ వివరణ!

బాలీవుడ్ జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ తమ మగబిడ్డకు ‘తైమూర్’ అనే పేరు పెట్టడంపై నెటిజన్లు ఎంతటి రాద్ధాంతం చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమకు ఇష్టమైన పేరును తమ బిడ్డకు వారు పెట్టుకుంటారంటూ ఈ సందర్భంగా సైఫ్ దంపతులకు బాలీవుడ్ మద్దతు పలకడం విదితమే. ఈ నేపథ్యంలో, ఈ విషయమై సైఫ్ స్పందిస్తూ.. తనకు, తన భార్యకూ ఈ పేరు చాలా నచ్చిందని,  తమ అబ్బాయికి ఏ పేరు అయినా పెట్టుకునే స్వేచ్ఛ తమకు ఉందని అన్నాడు.

టర్కీని పాలించిన తైమూర్ గురించి తనకు తెలుసునని, అయితే, టర్కీ తైమూర్ పేరుకు, తమ అబ్బాయికి పెట్టిన తైమూర్ పేరుకి స్పెల్లింగ్ లో తేడా ఉంటుందని చెప్పాడు. తమ చిన్నారి  పేరు ‘టీఏఐ’ స్పెల్లింగ్ తో ఉంటుందన్నారు. పర్షియా భాషలో ఈ పదానికి అర్థం ‘ఇనుము’ అని చెప్పుకొచ్చాడు. చరిత్ర ఆధారంగా ఏదైనా ‘పేరు’పై ఒక నిర్ణయానికి రావడం సరికాదని, అర్థం లేని విషయమని అన్నాడు. మనం రైట్ వింగ్ సమాజంలో ఉన్నామని తాను అనుకోవడం లేదని, మన దేశ ప్రజలు నిష్పక్షపాతంగానే ఉంటారని తాను నమ్ముతున్నానని సైఫ్ అలీఖాన్ అన్నాడు.  

More Telugu News