Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు ఆస్తుల లెక్కలన్నీ బోగస్: అంబటి రాంబాబు

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మరోమారు ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఆస్తుల లెక్కలన్నీ బోగస్ అని, హైదరాబాద్ లో ఉన్న ఆయన ఇల్లే  కోట్ల రూపాయల విలువ చేస్తుందని, వాస్తవాలకు మసి పూయడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. అక్రమార్జనను దాచుకునేందుకే చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని అన్నారు.

3 లక్షల 22 వేల డాలర్లు చెల్లించి చంద్రబాబు దావోస్ నుంచి ఆహ్వానం పొందారని, కానీ, వాళ్లే ఆ ఆహ్వానం పంపించినట్లు బిల్డప్ ఇస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 16 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లిన చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. విదేశీ పర్యటనలకు చంద్రబాబు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రహస్య పర్యటనల వివరాలు వెల్లడించాలని, ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చెప్పాలని, ఆ విధంగా చేయకపోతే, మోసం చేస్తున్నారనే భావన ప్రజల్లో కలుగుతుందని అంబటి రాంబాబు అన్నారు.

More Telugu News