స‌చిన్‌లా నేను సుదీర్ఘకాలం ఆడలేకపోవచ్చు!: విరాట్ కోహ్లీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స‌చిన్‌లా నేను సుదీర్ఘకాలం ఆడలేకపోవచ్చు!: విరాట్ కోహ్లీ

ప్రత్యర్థి జట్లపై ల‌క్ష్య ఛేద‌న‌లో 17 సెంచ‌రీలు చేసిన స‌చిన్ టెండూల్కర్ రికార్డును నిన్న జరిగిన మ్యాచ్‌తో విరాట్‌ కోహ్లీ స‌మం చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను మ‌రోసారి స‌చిన్‌తో పోల్చుతూ ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. సచిన్ 463 వన్డేలు ఆడగా, కోహ్లీ మాత్రం 177వ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించాడు. అయితే, కోహ్లీ ఈ రోజు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... తాను స‌చిన్‌లా సుదీర్ఘకాలం ఆడలేకపోవచ్చని అన్నాడు. 200 టెస్ట్‌లు, 100 సెంచరీలు ఎంతో అద్భుతమైన అంకెలని అన్నాడు. వాటిని సాధించడం మాత్రం అసాధ్యమ‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. లక్ష్యాల‌కు హద్దులు ఉండకూడదని, ఒక్కోసారి మనమెంత సాధించగలమో తెలుసుకోకుండా ఇంతే చేయగలమని పరిమితం అయిపోతుంటామ‌ని ఆయ‌న చెప్పాడు. తానెప్పుడూ పరిమితులు విధించుకోనని అన్నాడు.
kohli

More Telugu News