అమాంతంగా పెరిగిపోయిన‌ ట్రంప్‌ బ్రాండ్ ఇమేజ్... ‘ట్రంప్‌ విస్కీ బాటిల్’ రూ.5 ల‌క్ష‌లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమాంతంగా పెరిగిపోయిన‌ ట్రంప్‌ బ్రాండ్ ఇమేజ్... ‘ట్రంప్‌ విస్కీ బాటిల్’ రూ.5 ల‌క్ష‌లు

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న డొనాల్డ్‌ ట్రంప్ ఇమేజ్ విప‌రీతంగా పెరిగిపోయింది. 2012లో ట్రంప్‌ పేరుతో తయారైన ఓ విస్కీ బాటిల్‌ను వేలం వేయ‌గా అది రికార్డు ధ‌ర‌కు అమ్ముడుపోయింది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో మెక్ టియర్స్ సంస్థ ఈ వేలం వేయ‌గా కెనడాకు చెందిన ఓ వ్యక్తి ఈ విస్కీ బాటిల్‌ను రూ.5 ల‌క్ష‌ల (ఆరు వేల పౌండ్లు)కు కొనుక్కున్నారు. ఊహించిన దానికంటే రెండింత‌లు ధ‌ర అధికంగా ప‌లికింద‌ని నిర్వాహ‌కులు తెలిపారు.

ఈ విస్కీ బాటిళ్ల‌ను ప‌రిమిత సంఖ్య‌లో ఆబర్దీన్ షైర్ ప్రాంతంలోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ లింక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా త‌యారు చేశారు. ఈ విస్కీ బాటిల్ కవర్ పై డొనాల్డ్‌ ట్రంప్ ఆనాడు చేసిన‌ సంతకం కూడా ఉంది. ఈ సింగిల్ మాల్ట్ విస్కీ అద్భుతంగా ఉంటుందని నిర్వాహ‌కులు పేర్కొన్నారు. ట్రంప్ అమెరికాకి అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఇప్పుడు ఈ విస్కీ ఇంత‌ ధ‌ర ప‌లికింద‌ని చెబుతున్నారు.
trump wiskey

More Telugu News