Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు

పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేప‌థ్యంలో పాత‌నోట్ల‌ను మార్చుకునేందుకు ఆర్‌బీఐ ఇచ్చిన గ‌డువు ముగిసిన‌ప్ప‌టికీ పోలీసుల‌కు భారీ మొత్తంలో న‌గ‌దు ప‌ట్టుబ‌డుతోంది. ఈ రోజు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆగ్రాలో త‌నిఖీలు నిర్వ‌హిస్తోన్న పోలీసులు రూ.కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును నలుగురు వ్య‌క్తులు త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశార‌ని, వారిని అదుపులోకి తీసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తాము ఐటీ శాఖ అధికారులకు సమాచారమందించామ‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.
demonitization
arrests

More Telugu News