‘మంచిపని చేస్తున్నారు’... మంత్రి కేటీఆర్ను అభినందించిన నటి మంచు లక్ష్మి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘మంచిపని చేస్తున్నారు’... మంత్రి కేటీఆర్ను అభినందించిన నటి మంచు లక్ష్మి

చేనేత కార్మికులను ఆదుకునేందుకు వారంలో ఒక‌సారి చేనేత వ‌స్త్రాలు వాడాల‌ని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపున‌కు సినీప్ర‌ముఖుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇటీవ‌లే నాగార్జున‌, అమ‌ల చేనేత దుస్తుల్లో ద‌ర్శ‌న‌మిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ దిశ‌గా ప్ర‌భుత్వ అధికారులు కూడా స్పందిస్తూ చేనేత వ‌స్త్రాల‌ను ధ‌రిస్తున్నారు. సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకొని నటి, యాంక‌ర్‌ మంచు లక్ష్మి ఈ రోజు చేనేత దుస్తులను ధరించారు. సంప్రదాయక దుస్తుల్లో త‌న‌ తండ్రి మోహన్ బాబు, పాపతో కలిసి దిగిన ఓ ఫోటోను ఆమె త‌న‌ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ... చేనేత ప్రచారకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మంచిపని చేస్తున్నందుకు కేటీఆర్ను అభినందించారు.


manchu family

More Telugu News