‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది: వెంక‌య్య‌నాయుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది: వెంక‌య్య‌నాయుడు

కేవ‌లం 79 రోజుల్లో అద్భుతంగా రూపుదిద్దుకున్న‌ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాను కేంద్రమంత్రి వెంకయ్య‌నాయుడు ఈ రోజు ఆ చిత్రం హీరో బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు క్రిష్‌ల‌తో క‌లిసి వీక్షించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో వారంతా క‌లిసి ఈ సినిమాను చూశారు. అనంత‌రం వెంక‌య్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ.... క్రిష్‌కు అభినంద‌న‌లు తెలిపారు. నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచేలా శాలివాహన చక్రవర్తి చరిత్రను ఆయ‌న అద్భుతంగా తెర‌కెక్కించార‌ని వెంక‌య్య కొనియాడారు. అతి తక్కువ కాలంలోనే  ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించడం తననెంతో ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. తాను సాధార‌ణంగా సినిమాలు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపన‌ని, అయితే చరిత్ర ఆధారంగా తీసిన ఈ సినిమా త‌న‌ను ఆకట్టుకుందని వ్యాఖ్యానించారు. ఈ సినిమా మరింతగా ప్రేక్షకాదరణ పొందుతుందని అన్నారు.
venkaiah

More Telugu News