Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహిళలపై అకృత్యాలు, బాలికలను వేశ్యలుగా మార్చడం... పాక్ సైన్యం అరాచకాలు!

పాకిస్థాన్ లోని వజీరిస్థాన్, స్వాత్ లోయల్లో ఆ దేశ సైన్యం చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ ప్రాంతాల్లో పాక్ సైన్యం యొక్క వికృత చేష్టలను 'పస్తూన్' యాక్టివిస్ట్ ఉమర్ ఖటక్ మరోసారి ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. పస్తూన్ బాలికలను కిడ్నాప్ చేస్తున్న సైనికులు... వారిని బలవంతంగా సెక్స్ వర్కర్లుగా మారుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇళ్లను కూల్చివేసి, మహిళలపై దారుణాలకు తెగబడుతున్నారని అన్నారు.

పాక్ సైన్యం ఆగడాలను భరించలేక ఇప్పటికే 5 లక్షల మంది ప్రజలు పాకిస్థాన్ ను విడిచి ఆఫ్ఘనిస్థాన్ కు తరలివెళ్లారని యూఎన్ హెచ్సీఆర్ నివేదిక చెబుతోందని ఉమర్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో టెర్రరిస్టుల క్యాంపులను ఏర్పాటు చేసేందుకే పస్తూన్లను పాకిస్థాన్ ఖాళీ చేయిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ఆగడాల నుంచి రక్షించుకోవడానికి 'పస్తూనిస్థాన్ లిబరేషన్ ఆర్మీ'ని స్థాపిస్తామని చెప్పారు. ఈ విషయంలో తమకు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలని కోరారు. పాకిస్థాన్ అనేది చెడ్డ దేశాలకు అణ్వాయుధాలను అమ్మే ఓ న్యూక్లియర్ బ్లాక్ మార్కెట్ అని... తమపై కూడా అణ్వాయుధాలను ప్రయోగించడానికి వెనుకాడదని అన్నారు.


More Telugu News