భోజనం సరిగా ఉండట్లేదని జవాను చేసిన ఆరోపణలపై స్పందించిన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్
లౌకికవాద దేశమైన భారత్లో సరిహద్దుల వద్ద ఎన్నో సమస్యలు ఉంటాయని రావత్ అన్నారు. జమ్ముకశ్మీర్లో ప్రస్తుత పరిస్థితి అదుపులో ఉందని, ఆ రాష్ట్రంలో విద్యాలయాలను యథావిధిగా నడపాలని అన్నారు. ఉగ్రవాదుల చొరబాట్ల వల్ల భారత్కు ప్రమాదం ఉంటుందని, ఆర్మీ 24 గంటలూ ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. సైనికులు మరింత శక్తిమంతంగా తయారు కావాలని పేర్కొన్నారు.