గాలిపటం, బొంగరాలు, గోలీలు, కర్రాబిళ్ల ఆటలతో... సంక్రాంతి నాడు చంద్రబాబు ఫుల్ ఎంజాయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గాలిపటం, బొంగరాలు, గోలీలు, కర్రాబిళ్ల ఆటలతో... సంక్రాంతి నాడు చంద్రబాబు ఫుల్ ఎంజాయ్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.  ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు హాజరైన చంద్రబాబు సంబరాలను ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన గాలిపటాన్ని ఎగురవేశారు. అనంతరం బొంగరంతో ఆడారు. ఆ తర్వాత కర్రాబిళ్ల ఆట ఆడారు. అనంతరం గోలీల ఆట ఆడారు. ఇప్పటి తరం మరిచిపోయిన ఆటలన్నింటినీ చంద్రబాబు ఆడటం గమనార్హం. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు తమ కళలను ప్రదర్శించారు. విజయవాడలోని ఏ-వన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరయ్యారు.  

More Telugu News