టాటా సన్స్ కొత్త చైర్మన్ చంద్రశేఖరన్ గురించిన ఆసక్తికర విషయాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టాటా సన్స్ కొత్త చైర్మన్ చంద్రశేఖరన్ గురించిన ఆసక్తికర విషయాలు!

టాటా సన్స్ కొత్త చైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్ నియమితులైన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీసీఎస్ సీఈవో, ఎండీగా వ్యవహరిస్తున్న ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.

*  చంద్రశేఖరన్ ను ఎక్కువగా ‘చంద్ర’ అని సంభోదిస్తుంటారట.
*  తమిళనాడు తిరుచ్చిలోని ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్ లో ఆయన పీజీ చేశారు. ఆ తర్వాత 1987 లో టీసీఎస్ లో చేరారు.
*  మంచి వ్యాపారవేత్త అయిన ఆయనలో ఫ్రొపెషనల్ ఫొటోగ్రాఫర్ కూడా ఉన్నారట.
*  మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆయన లాంగ్ డిస్టెన్స్ రన్నర్ కూడా. ముంబయి, న్యూయార్క్, టోక్యో, బోస్టన్, ఆమ్ స్టర్ డ్యాం, బెర్లిన్ తదితర చోట్ల నిర్వహించిన పలు మారథాన్లలో ఒకప్పుడు ఆయన పాల్గొన్నారట.
*  2009 నుంచి టీసీఎస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న చంద్రశేఖరన్, మిస్త్రీని తొలగించాక బోర్డు డైరెక్టర్ గా ఆయన నియమితులయ్యారు. 

More Telugu News