Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాహుబలి రికార్డ్ను బద్దలు కొట్టేసిన చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’.. తొలిరోజు వసూళ్లు 39 కోట్లు

తొమ్మిది సంవ‌త్స‌రాల త‌రువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ రికార్డుల మోత మోగిస్తోంద‌ని సినీ విశ్లేష‌కులు అంటున్నారు. భారీ అంచ‌నాలతో వ‌చ్చిన ఈ మూవీ అందుకు త‌గ్గ‌ట్టుగానే రికార్డుస్థాయిలో క‌లెక్ష‌న్లు రాబ‌డుతూ బాహుబ‌లిని వెనక్కి నెట్టిందని చెబుతున్నారు. నిన్న తొలి రోజు కలెక్షన్లను ప‌రిశీలిస్తే ఖైదీ నంబర్ 150 సరికొత్త రికార్డ్ న‌మోదు చేసింద‌ని పేర్కొంటున్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో క‌లిపి ఒక్క రోజులోనే 39 కోట్ల రూపాయ‌ల‌కు పైగా కలెక్ష‌న్లు వ‌చ్చాయ‌ని చెబుతున్నారు. రాజ‌మౌళి సూప‌ర్ హిట్ మూవీ 'బాహుబ‌లి ది బిగినింగ్‌'కి మొద‌టి రోజు క‌లెక్ష‌న్లు 35 కోట్లు. ఇప్పుడు ఆ రికార్డును చిరు మూవీ బద్దలు కొట్టింద‌ని చెబుతున్నారు. దీంతో చిరు తెలుగు చిత్రానికి కొత్త టార్గెట్ ఇచ్చాడ‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు 
chiru
khaidi

More Telugu News