‘తృణమూల్’ కార్యాలయంపై కాల్పులు... ఐదుగురికి తీవ్ర గాయాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘తృణమూల్’ కార్యాలయంపై కాల్పులు... ఐదుగురికి తీవ్ర గాయాలు!

పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు ఈరోజు కాల్పులకు పాల్పడ్డారు. ఖరగ్ పూర్ లోని పార్టీ కార్యాలయంపై జరిపిన కాల్పుల ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో అప్రమత్తమైన పోలీసులు కార్యాలయం చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More Telugu News