Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బరాక్ ఒబామాకు ఉద్యోగం ఇస్తామంటూ మరో ఆఫర్!

అమెరికా అధ్య‌క్షుడు ఒబామా మ‌రికొన్ని రోజుల్లో త‌న ప‌దవికి గుడ్ బై చెప్ప‌నున్న నేప‌థ్యంలో ఆయ‌నకు ప‌లు కంపెనీలు జాబ్ ఆఫ‌ర్లు ఇస్తూ వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మ‌రో కంపెనీ కూడా జాబ్ ఇస్తామంటూ ముందుకు వ‌చ్చింది. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత స్ట్రీమింగ్ సర్వీస్ స్పాటిఫై సీఈవో డేనియెల్ ఏక్ త‌న ట్వీట్‌లో ఒబామాకు త‌మ కంపెనీలో ఓ జాబ్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.

త‌మ కంపెనీలో ప్రెసిడెంట్ ఆఫ్ ప్లేలిస్ట్స్ అన్న హోదాలో ప‌నిచేసేందుకు ఒక‌రు కావాల‌ని అమెరికాను క‌నీసం ఎనిమిదేళ్లు పాలించిన అనుభ‌వం ఉన్న అభ్య‌ర్థి కోసం తాము ఎదురుచూస్తున్నామ‌ని స‌ర‌దాగా ఓ యాడ్‌ను రూపొందించి పోస్టు చేశారు. ఆ ఉద్యోగం పొందడానికి నోబెల్ పీస్ ప్రైజ్ గెలిచిన‌వారే అర్హుల‌ని నిబంధ‌న పెట్టారు. ఇంకా అద‌న‌పు అర్హ‌త‌లుగా వివిధ రంగాల్లోని క‌ళాకారుల‌తో స‌త్సంబంధాలు ఉండాల‌ని పేర్కొన్నారు. ప్లేలిస్ట్స్ గురించి ప్రెస్‌మీట్ల‌లో అన‌ర్గ‌ళంగా మాట్లాడాల‌ని చెప్పారు. అభ్య‌ర్థి ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ వ‌క్త‌లో ఒక‌రిగా ఉండాల‌ని ఆ యాడ్‌లో పేర్కొన్నారు. ఈ అర్హతలన్నీ ఒబామాకు వున్నాయి కాబట్టి సదరు కంపెనీ సరదాగా ఈ జాబ్ ఆఫర్ చేసిందన్న మాట!  
obama

More Telugu News