Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘మెగా సర్జికల్‌ స్ట్రయిక్‌... లెట్స్‌ డు రికార్డ్స్‌ కుమ్ముడు’... ‘ఖైదీ నంబర్‌ 150’పై సినీ ప్రముఖుల ట్వీట్లు

మెగాస్టార్‌ చిరంజీవి న‌టించిన‌ ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుద‌లై మంచి స్పంద‌న‌ను అందుకుంటోంది. ఈ చిత్రం ప్ర‌ద‌ర్శితమ‌వుతున్న‌ థియేట‌ర్ల ముందు చిరు అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. సినీన‌టుడు అల్లు అర్జున్, దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ రోజు తమ సినిమా షూటింగును కేన్సిల్ చేసుకుని మరీ ఆ సినిమాను చూసిన సంగ‌తి తెలిసిందే. వారిద్ద‌రితో పాటు ప‌లువురు సినీ ప్రముఖులు చిరంజీవి సినిమాపై ట్వీట్ చేసి హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

‘అమ్మడు! లెట్స్‌ డు రికార్డ్స్‌ కుమ్ముడు!’ అంటూ అల్లు అర్జున్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ చేస్తే.. ‘బాక్సాఫీసులు బద్దలు.. అన్ని ఏరియాలనూ రఫ్‌ అడిస్తున్న మెగాస్టార్‌..’ అని హ‌రీశ్‌ శంక‌ర్‌ ట్వీట్‌ చేశాడు. మ‌రోవైపు అల్లు శిరీష్ ఏకంగా ‘మెగా సర్జికల్‌ స్ట్రయిక్‌’ అని త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు.

chiru
khaidi

More Telugu News