3 టికెట్లు 36 లక్షలా?...చిరంజీవిపై అభిమానానికి పరాకాష్ట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

3 టికెట్లు 36 లక్షలా?...చిరంజీవిపై అభిమానానికి పరాకాష్ట!

స్టార్ హీరోల సినిమాల విడుదల సందర్భంగా ఫస్ట్ డే ఫస్ట్ షోకు ఉండే డిమాండే వేరు. ఆ డిమాండ్ అభిమానుల్లో ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియజెప్పే ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... రేపు ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీనిని పురస్కరించుకుని బెంగళూరులోని ఓ ధియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షోకు సంబంధించిన టికెట్లు వేలానికి పెట్టారు. కేవలం మూడు టికెట్లను చిరంజీవి అభిమాని ఒకరు 36 లక్షల రూపాయలకు దక్కించుకున్నారన్న సమాచారం కలకలం రేపుతోంది. బ్లాక్ లో కొనుక్కున్న టికెట్ల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయని అభిమానులు అంటున్నారు. సినిమా ప్రారంభం సమయానికి ఈ బ్లాక్ టికెట్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. 

More Telugu News