ప్రత్యక్ష క్రికెట్ కార్యకలాపాల్లోకి తిరిగొస్తున్న అజారుద్దీన్... హెచ్సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రత్యక్ష క్రికెట్ కార్యకలాపాల్లోకి తిరిగొస్తున్న అజారుద్దీన్... హెచ్సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, క్రికెట్ కార్యకలాపాల నుంచి నిషేధాన్ని ఎదుర్కొంటూ, దాదాపు 16 సంవత్సరాలుగా ఆటకు, మైదానానికీ దూరమైన మహమ్మద్ అజారుద్దీన్ ప్రత్యక్ష క్రికెట్ కార్యకలాపాల్లోకి తిరిగి వచ్చాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి అజర్ నామినేషన్ దాఖలు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హెచ్‌ సీఏను ప్ర‌క్షాళ‌న చేయ‌డానికే తాను వచ్చానని, ఇక తన జీవితాంతం క్రికెట్ కే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. కాగా, ఏ క్ల‌బ్ నుంచి అజర్ నామినేష‌న్ దాఖ‌లు చేశాడ‌న్న విష‌యం తెలియరాలేదు. అజ‌ర్ ఎంట్రీతో ఈ ఎన్నిక‌లు హాట్ హాట్ గా సాగుతాయని క్రీడా పండితులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై, తన వందో టెస్టుకు ముందు అజర్ తన కెరీర్ ను ముగించిన సంగతి తెలిసిందే.

More Telugu News