మనసు మార్చుకున్న 'ఈగ' విలన్ సుదీప్... భార్యతోనే ఉండాలని నిర్ణయం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మనసు మార్చుకున్న 'ఈగ' విలన్ సుదీప్... భార్యతోనే ఉండాలని నిర్ణయం!

కన్నడ స్టార్ హీరో, బాహుబలి, ఈగ ఫేమ్ సుదీప్ తన మనసు మార్చుకున్నాడు. కుటుంబ కలహాలను పరిష్కరించుకుని, భార్యతో కలసి జీవించాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబ కలహాలతో సుదీప్ దంపతులు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. వీరిద్దరి తాజా నిర్ణయంతో వారి కుటుంబాల్లోనేకాక, సుదీప్ అభిమానుల్లో సైతం సంతోషం నెలకొంది.

సుదీప్, ప్రియ 2001లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోవాలని వీరు నిర్ణయించుకున్నారు. విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భార్యకు పెద్ద ఎత్తున భరణం ఇచ్చేందుకు కూడా సుదీప్ సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో, వీరిద్దరూ కలిసే బతకాలని నిర్ణయించుకోవడం అభినందించదగ్గ విషయం. 

More Telugu News