నా తర్వాతి సినిమా ‘నరవాహనం’!: ఆర్.నారాయణమూర్తి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా తర్వాతి సినిమా ‘నరవాహనం’!: ఆర్.నారాయణమూర్తి

తన సొంత బ్యానర్ లో త్వరలో నిర్మించనున్న చిత్రం పేరు ‘నరవాహనం’ అని ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి వెల్లడించారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సంక్రాంతి పండగకు ప్రేక్షకుల ముందుకు రానున్న తన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ చిత్రం మంచి హిట్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు. తనకు నచ్చితేనే  ఏ సినిమా అయినా చేస్తానని చెప్పిన ఆయన, ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ కథ నచ్చడంతో చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో నటించానని నారాయణమూర్తి పేర్కొన్నారు.

More Telugu News