చైనా, హాంకాంగ్‌లలో రూ.14 వేల కోట్లకు మెక్‌డొనాల్డ్స్‌ విక్రయం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చైనా, హాంకాంగ్‌లలో రూ.14 వేల కోట్లకు మెక్‌డొనాల్డ్స్‌ విక్రయం

అమెరికాకు చెందిన ఫాస్ట్‌ఫుడ్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ చైనా, హాంకాంగ్‌లలో త‌మ వ్యాపారాన్నిమ‌రింత విస్త‌రించుకుంది.
సిటిక్‌ గ్రూప్‌, కార్లీ గ్రూప్‌ కన్సార్టియంకు అక్కడి ఫ్రాంచైజీల వ్యాపారాన్ని 2.08 బిలియన్‌ డాలర్లు (రూ.14వేల కోట్లు)కు విక్ర‌యించిన‌ట్లు ఈ రోజు ప్ర‌క‌టించింది. చైనా, హాంకాంగ్‌లలో సిటిక్‌ లిమిటెడ్‌, సిటిక్‌ క్యాపిటల్‌ హోల్డింగ్స్‌, కార్లీ గ్రూప్‌, మెక్‌డొనాల్డ్స్‌ కలిసి ఒక కంపెనీని ఏర్పాటు చేశాయని, ఇది అక్కడి వ్యాపారాల‌కు బాధ్యత వహిస్తుంద‌ని చెప్పింది. తాము చేసుకున్న ఈ ఒప్పందం 20 ఏళ్లపాటు అమల్లో ఉంటుందని పేర్కొంది.


mc donald

More Telugu News