: ముస్లింలపై వ్యాఖ్యానించిన బీజేపీ నేత సాక్షి మహరాజ్ పై ఈసీ కేసు
దేశంలో జనాభా పెరగడానికి ముస్లింలే కారణమని వ్యాఖ్యానించిన ఉన్నావో ఎంపీ, బీజేపీ నేత సాక్షి మహరాజ్ పై ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసింది. ఆయన వ్యాఖ్యలపై విచారించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టరును ఆదేశించింది. మత పరమైన వ్యాఖ్యలు చేస్తే, కేసులు నమోదు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, మీరట్ లోని బాలాజీ టెంపుల్ మహంత్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సాక్షీ మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నలుగురు భార్యలు, 40 మంది పిల్లల్ని కని దేశ జనాభా శరవేగంగా పెరిగేందుకు ముస్లింలు కారణమంటూ ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే.