నాగబాబు కామెంట్ ఎఫెక్ట్.. చిరంజీవికి సారీ చెప్పిన రామ్ గోపాల్ వర్మ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాగబాబు కామెంట్ ఎఫెక్ట్.. చిరంజీవికి సారీ చెప్పిన రామ్ గోపాల్ వర్మ!

'ఖైదీ నెంబర్ 150' సినిమా వేడుకలో మెగా బ్రదర్ నాగేంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. మెగా ఫ్యామిలీకి ట్విట్టర్‌ ద్వారా క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తన పోస్టులో ... ''నాగబాబు గారూ, మీరు ట్విట్టర్‌ లో లేరు కాబట్టి ఎవరైనా నా ఈ ట్వీట్లు మీకు చూపిస్తారని ఆశిస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. నేనేదో నా స్టైల్లో అందరి మీద, అన్నింటి మీద ఏదో ఒక అభిప్రాయం చెబుతూ ఉంటాను. ఒట్టి మీ ఫ్యామిలీ మీదే కాదు, అన్ని విషయాల మీదా నా అభిప్రాయం చెబుతుంటాను. అది మీరు వినే ఉంటారు. నా ట్వీట్లు మోదీ గారి దగ్గర నుంచి బచ్చన్‌ గారి వరకు చివరకి నా మీద నేనే చాలా కామెంట్లు చేస్తూ ఉంటాను. కానీ మీరు చాలా అఫెండ్ అయ్యి, హర్ట్ అయ్యారని నాకు తెలిసింది. కనుక నేను చాలా నిజాయతీగా మీకు, మీ కుటుంబానికి సారీ చెబుతున్నాను. నా ఉద్దేశం వేరే అయినా మీరు హర్ట్ అయ్యారు కనుక చిరంజీవి గారికి కూడా నా తరఫున దయచేసి సారీ చెప్పండి.. థాంక్స్'' అంటూ వర్మ తన ట్వీట్ల పరంపరను వదిలారు.









More Telugu News