మరో ఆఫర్ ప్రకటించిన వొడాఫోన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరో ఆఫర్ ప్రకటించిన వొడాఫోన్

ప్రపంచ టెలికాం దిగ్గజం వొడాఫోన్ తమ వినియోగదారులకు ఇప్పటికే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరిన్ని బంపర్ ఆఫర్లను ప్రకటించింది. తమ ప్రీపెయిడ్ యూజర్ల కోసం ‘సూపర్ అవర్’ పేరిట ఒక ప్లాన్‌ను తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ ప్లాన్‌లో తక్కువ ధరలకే పలు ప్యాక్‌ల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న‌ట్లు తెలిపింది. రూ.16, రూ. 7, రూ.5 డేటా ప్యాక్‌లను అందిస్తున్న‌ట్లు చెప్పింది. క‌స్ట‌మ‌ర్లు రూ.16తో రీఛార్జ్ చేసుకుంటే ఒక గంట పాటు అన్‌లిమిటెడ్ 3జీ-4జీ డేటాను పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది. అత్యంత వేగంతో ఒక గంటలోపు ఎన్ని డౌన్‌లోడ్‌ల‌యినా చేసుకోవచ్చని చెప్పింది.

ఈ ప్యాక్‌ని ఒక రోజులో ఎన్ని సార్లయినా రీఛార్జ్ చేసుకోవచ్చని చెప్పింది. అయితే, సర్కిల్‌ను బట్టి ప్లాన్ రేటు కూడా మారుతుందని పేర్కొంది. ఇక‌ రూ. 5తో రీఛార్జ్ చేసుకుంటే ఒక గంటపాటు అన్‌లిమిటెడ్ 2జీ డేటా పొంద‌వ‌చ్చ‌ని, రూ.7తో రీఛార్జ్ చేసుకుంటే ఒక గంట పాటు వొడాఫోన్ నుంచి వొడాఫోన్ కు అప‌రిమిత కాల్స్ చేసుకోవచ్చని తెలిపింది. ఎల్లుండి నుంచే ఈ ప్లాన్స్ అందుబాటులోకి వ‌స్తాయ‌ని వొడాఫోన్ ప్ర‌తినిధులు తెలిపారు. అయితే, ఈ ప్లాన్లు ఆంధ్రప్రదేశ్- తెలంగాణ, బీహార్‌- జార్ఖండ్, మధ్యప్రదేశ్- చ‌త్తీస్‌గఢ్, పంజాబ్ - హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్ సర్కిల్స్‌లో మాత్రం అందుబాటులో ఉండవ‌ని పేర్కొంది.
vodafone

More Telugu News